: వాట్ సార్? త్వరలో మీరు రిటైర్ కాబోతున్నారు...ఇక నా జోలికి రాకండి: నాటి పోలీస్ కమిషనర్ తో మాఫియా డాన్ దావూద్


‘వాట్ సార్? మీరు త్వరలో రిటైర్ కాబోతున్నారు, కనీసం, ఇప్పుడైనా నా గురించి, కేసుల గురించి ఆలోచించకండి’ అంటూ ఫోన్ లో ఒక గొంతు విన్పించింది. ఆ గొంతు ఎవరిదంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంది. ఇంతకీ, ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే నాటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్. ఈ విషయాన్ని ఆయన రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నారు. ‘నేను పోలీస్ కమిషనర్ ఉద్యోగం నుంచి రిటైర్ అవడానికి కొన్ని వారాల ముందు ఈ ఫోన్ కాల్ నాకు వచ్చింది. అది కూడా, నా పర్సనల్ ఫోన్ నంబరుకు ఈ కాల్ వచ్చింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సమయం అది. నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఎటువంటి భద్రత ఉండదన్న విషయాన్ని దావూద్ తన ఫోన్ కాల్ లో పరోక్షంగా ప్రస్తావించాడు’ అని తాను రాసిన పుస్తకంలోని ఒక చాప్టర్ ‘డయల్ డి ఫర్ డాన్’లో నీరజ్ కుమార్ ఈ విషయాలను పేర్కొన్నారు. 1976 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన నీరజ్ కుమార్, 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసు దర్యాప్తును కూడా పర్యవేక్షించారు. ఈ పుస్తకంలో మొత్తం 11 కేసుల దర్యాప్తునకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో తన సంభాషణల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News