: అనురాధ హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు అందించిన పోలీసు జాగిలాలు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ హత్య అనంతరం ఆ ప్రాంతాన్ని కలియతిరిగిన పోలీసు జాగిలాలు ప్రాథమిక సాక్ష్యాలను పోలీసులకు అందించాయి. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి బయలుదేరిన శునకాలు నేరుగా కఠారి మోహన్ మేనల్లుడు చంటి కార్యాలయానికి, ఆపై ఇంటి వైపు వెళ్లాయి. దీంతో హత్యకు ముందు లేదా ఆ తరువాత దుండగులు చంటి కార్యాలయానికి వచ్చి వెళ్లుండాలని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇప్పటికే చంటిపై అనుమానంతో అనురాధ అనుచరులు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంటి ఎక్కడున్నాడో తెలియదని, సాధ్యమైనంత త్వరలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. గతంలో చంటికి, మోహన్ కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.