: మిత్రుడి కోసం విలపిస్తున్న పాప్ స్టార్ బీబర్!


పారిస్ లో జరిగిన ‘ఉగ్ర’ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తన మిత్రుడి కోసం పాప్ స్టార్ జస్టిన్ బీబర్ రోదిస్తున్నాడు. బీబర్ మిత్రుడు థామస్ అయాద్ యూనివర్శల్ మ్యూజిక్ గ్రూప్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఈ సంఘటనలో తన స్నేహితుడి ప్రాణాలు కోల్పోవడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానన్నాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. ‘పారిస్ సంఘటన గురించి, ఆ దుర్ఘటనలో నా మిత్రుడు థామస్ మృతి చెందడం గురించిన ఆలోచనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు. నా కోసం ఎంతో చేసిన అతనికి కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నాను. 'నీ గురించిన ఆలోచనల్లో, చేసే ప్రార్థనల్లో నీ కుటుంబసభ్యులతో, మిత్రులతో కలిసి పాలుపంచుకుంటాను’ అని బీబర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News