: వరంగల్ లో జగన్ ప్రచారం పరోక్షంగా టీఆర్ఎస్ కు మద్దతే!: ఎంపీ గుత్తా
వరంగల్ ఉపఎన్నికలో వైఎస్ జగన్ ప్రచారం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆయన ప్రచారం చేయడమంటే టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే వైసీపీని టీఆర్ఎస్ పోటీకి దింపిందని, ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని వరంగల్ లో ఆయన ఆరోపించారు. ఇక ఎంపీ కవిత షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. 'ఆయనో పిచ్చిముదిరిన మేధావి' అని మండిపడ్డారు.