: దుండగుల దాడిలో చిత్తూరు మేయర్ మృతి... భర్త పరిస్థితి విషమం!
దుండగుల దాడిలో గాయపడిన చిత్తూరు మేయర్ అనురాధ మరణించారు. ఆమెను తుపాకితో కాల్చి, ఆ తర్వాత కత్తితో దాడి చేసి హత్య చేశారు. పట్టపగలు చిత్తూరు మేయర్ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు అనురాధ, ఆమె భర్త మోహన్ పై కాల్పులు జరిపి, కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్త మోహన్ శరీరంలోకి బుల్లెట్ దిగబడింది. వెంటనే ఆయనను వేలూరు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చిత్తూరు ప్రజలు షాక్ అయ్యారు.