: బాక్సైట్ జీవో విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమే: డిప్యూటీ సీఎం కేఈ


విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి సీఎం చంద్రబాబు, అటవీశాఖ మంత్రికి సమాచారం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. జీవో విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనన్నారు. కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని, అయితే వాటిని సవరించుకుంటామని చెప్పారు. ముఖ్యమైన జీవోల విషయంలో అధికారులు సమాచారం ఇవ్వాలని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేఈ కోరారు. కాగా ఉత్తరాంధ్ర, రాయలసీమపై తాము వివక్ష చూపడం లేదని తెలిపారు. రేపు జరిగే రాయలసీమ జేఏసీ భేటీకి తాను హాజరుకాబోనని స్పష్టం చేశారు. కరవు మండలాలపై రీసర్వే చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News