: చిత్తూరు మేయర్, ఆమె భర్తపై హత్యాయత్నం... కత్తులు, తుపాకీతో దాడి
చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ పై హత్యాయత్నం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ దాడి జరిగింది. అర గంట క్రితం గుర్తు తెలియని దుండగులు వీరిపై కత్తితో దాడి చేసి, తుపాకితో కాల్చినట్టు సమాచారం. ఆటోలో వచ్చిన దుండగులు, ముసుగులు ధరించి దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం. కర్ణాటకకు చెందిన ముగ్గురు దుండగులు దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వీరిని పోలీసులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిలో ఇద్దరు దుండగులను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.