: ఐఎస్ కు 40 దేశాల నుంచి నిధులు...జాబితాలో జీ20 దేశాలూ ఉన్నాయి: రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఐఎస్ తీవ్రవాదులకు నిధుల ప్రవాహంపై జీ20 వేదికగా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. జీ20 సదస్సు ముగిసిన తర్వాత స్వదేశం చేరిన పుతిన్... ఐఎస్ ఆర్థిక మూలాలపై మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి ఐఎస్ ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని, ఈ తరహా దేశాల జాబితాలో జీ20 సభ్య దేశాలు కూడా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా దేశాలకు చెందిన ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో కొనసాగుతున్న పలు సంస్థల నుంచి ఐఎస్ టెర్రరిస్టులకు నిధులు అందుతున్నట్ల తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.