: మోదీ, చంద్రబాబు, కేసీఆర్ ల కష్టాలకు కారణం ఇదే: స్వామీ స్వరూపానందేంద్ర


ఎప్పుడూ వార్తల్లో నిలిచే విశాఖపట్నం శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతికి పెట్టిన ముహూర్తం సరైంది కాదని మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం బాగోలేదు కాబట్టే ఆ వేడుకకు హాజరైన వారంతా కష్టాల్లో పడ్డారని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని, బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత మొదలైందని, కేసీఆర్ పై సీబీఐ కేసు బయటకు వచ్చిందని... ఇవన్నీ ముహూర్తం బాగోలేకపోవడం వల్లే జరిగాయని తెలిపారు.

  • Loading...

More Telugu News