: డబ్బున్న ఆడవాళ్ల వద్దకు మేల్ ఎస్కార్ట్స్... నందినిపై కొత్త కేసు


'బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్' పేరిట హైదరాబాదులో బ్యూటీ పార్లర్ నడుపుతూ, కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఉదంతంలో పోలీసు కేసులను ఎదుర్కొంటున్న యలమంచిలి నందినిపై 'మేల్ ఎస్కార్ట్స్' కేసు తాజాగా నమోదైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ధనవంతులైన మహిళల వద్దకు ఆమె పురుషులను పంపే వ్యాపారం చేసిందని, సుమారు 25 మంది మహిళా కస్టమర్లకు 'మేల్ ఎస్కార్ట్స్' సేవలను అందించిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఆమెను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల తాము విచారించగా, నందిని చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమెపై నాలుగు రోజుల క్రితం చందనా బ్రదర్స్ యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమను కూడా మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ తో పాటు నాంపల్లి, పంజాగుట్ట స్టేషన్లకు వస్తున్న నందిని బాధితులు ఆమె తమను ఎలా మోసం చేసిందన్న విషయాలు చెబుతుంటే పోలీసులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

  • Loading...

More Telugu News