: మసీదుల్లోనే అంతా జరుగుతోంది.. వాటిని మూసేయాలి!: డొనాల్డ్ ట్రంప్
ఉగ్రవాదుల కార్యకలాపాలకు అమెరికాలో చోటుండదని, దేశంలోని కొన్ని మసీదులను మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి బరిలో దిగుతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. "మసీదుల్లోనే అంతా జరుగుతోంది. అక్కడి కార్యకలాపాలపై నిఘా పెట్టాలి. మసీదులపై అధ్యయనం చేయాల్సివుంది. మసీదుల మూసివేతకు నేను వ్యతిరేకమే అయినప్పటికీ, దేశ భద్రత దృష్ట్యా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమిది" అని ట్రంప్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 2001 దాడుల అనంతరం అమెరికాలోని మసీదులపై నిఘా పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆపై క్రమంగా నిఘా తగ్గిందని, తిరిగి దాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.