: డ్రైవరే లేకుండా నడుస్తున్న కారుకు ఫైన్ వేయబోతే..!


అది కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు కొలువైన ప్రాంతం. అక్కడి కార్లు గంటకు 35 కి.మీ వేగంతో వెళ్లాలి. ఓ కారు మాత్రం ఇంకా నిదానంగా 24 కి.మీ వేగంతో వెళ్తుండటాన్ని చూసిన ఓ పోలీసు బైకుపై దూసుకొచ్చాడు. నిదానంగా నడుస్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు జరిమానా విధించాలన్నది అతని ఆలోచన. కారు ముందుకు వచ్చి, దాన్ని ఆపి లోపలికి చూసి అవాక్కయ్యాడు. కారణం అందులో డ్రైవర్ లేకపోవడమే. ఆ కారు గూగుల్ సంస్థ తయారు చేసిన అత్యాధునిక బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రానిక్ కారు. దీన్ని వీధుల్లో తిప్పుతూ పరీక్షిస్తున్నామని, దీనికి అనుమతి వుందని అధికారులు చెప్పారు. రోడ్డు పరిస్థితుల దృష్ట్యా కారు వేగంలో మార్పులు జరుగుతుంటాయని, అది జరిమానా విధించేంత తప్పు కాదని పోలీసులు కూడా అంగీకరించారు. ఇక గూగుల్ సంస్థ కారును ఆపిన పోలీసును, పోలీసును చూసి ఆగిన కారు చిత్రాలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయగా, అవి హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News