: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్


శరీరం నిండా పచ్చబొట్లతో అందరినీ ఆకర్షించే ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ ను ఇక క్రికెట్ మైదానంలో చూడలేం. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు అతడు ప్రకటించాడు. టెస్టు, వన్డే, టీ20... అన్ని ఫార్మాట్ల నుంచి ఒకేసారి రిటైర్ అవుతున్నట్లు అతడు నిన్న పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టుతోనే తన కెరీర్ ను ముగిస్తున్నట్లు అతడు నిన్న ప్రకటించాడు. 34 ఏళ్ల వయసున్న మిచెల్ జాన్సన్ సుదీర్ఘ కాలం పాటు ఆసీస్ బౌలింగ్ కు వెన్నెముకలా నిలిచాడు. టెస్టుల్లో 311 వికెట్లు నేలకూల్చిన మిచెల్ జాన్సన్, టెస్టుల్లో అత్యధిక సంఖ్యలో వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్ గా రికార్డులకెక్కాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు అతడు అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News