: ఓరుగల్లు బరిలో ప్రచార హోరు... నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన


వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగిన ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు కీలక నేతలు నేరుగా ప్రచారంలోకి దిగగా, నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు కానున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గం మీదుగా వరంగల్ చేరుకోనున్న కేసీఆర్ బహిరంగ సభలో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడనున్నారు. ఉప ఎన్నికల విషయంలో మొన్నటిదాకా అంత పెద్దగా దృష్టి సారించని కేసీఆర్, మొన్నటి మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త ప్రభాకర్ రెడ్ది భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా ప్రజల నుంచి అక్కడక్కడ ఎదురవుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేటి బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి.

  • Loading...

More Telugu News