: వర్షాల కారణంగా పలు రైళ్ల దారి మళ్లింపు... వాటి వివరాలు


నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తడ- సూళ్లూరుపేట మధ్య రైల్వే వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల దారిని మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ రైళ్ల వివరాలు... తిరుపతి-సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, పద్మావతి ఎక్స్ ప్రెస్ లను రేణిగుంట, గుత్తి- రాయచూర్ మీదుగా; చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట- గుత్తి మీదుగా, కొచ్చివెలి- గువాహటి ప్రత్యేక రైలును రేణిగుంట- గుత్తి, యశ్వంత్ పూర్- టాటా ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్- ఛాప్రా ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట మీదుగా, చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట- గుత్తి మీదుగా, యశ్వంత్ పూర్- దానాపూర్ పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ ను రేణిగుంట-గుత్తి మీదుగా, మన్నార్ గుడి- భాగత్కి-గుత్తి రైలును రేణిగుంట-గుత్తి మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, పద్మావతి ఎక్స్ ప్రెస్, హైదరాబాద్-త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ ప్రెస్, ఢిల్లీ- త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ ప్రెస్, హటియా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- చెన్నై సెంట్రల్ చార్మినార్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్- హౌరా దురంతో ఎక్స్ ప్రెస్ లను గుత్తి మీదుగా; గోరఖ్ పూర్- త్రివేండ్రం రాప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ ను విజయవాడ- నంద్యాల మీదుగా, అల్లపుజా-ధన్ బాద్ బొకొరో ఎక్స్ ప్రెస్ ను గుత్తి- నంద్యాల మీదుగా, త్రివేండ్రం-కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను గుత్తి- గుంతకల్ మీదుగా, చైన్నై సెంట్రల్-ఢిల్లీ జీటీ ఎక్స్ ప్రెస్ ను గుత్తి- గుంతకల్ మీదుగా, సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు వికారాబాద్-రాయచూర్ మీదుగా దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News