: పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఉగ్రవాద దాడులకు కీలక సూత్రధారిని గుర్తించారు. బెల్జియంకు చెందిన 26 సంవత్సరాల అబ్దుల్ హమీద్ అబౌద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు. అతనిని బెల్జియం వాసిగా గుర్తించారు. కొంతమంది యువకులను రెచ్చగొట్టి అతడు ఈ దాడులకు వ్యూహ రచన చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్స్ జాతీయుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదైందని నిర్ధారించారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిని విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.