: భజ్జీ, యువీల బాటలో మరో క్రికెటర్... నిశ్చితార్థం అయిపోయింది


చూస్తుంటే ఇది టీమిండియా క్రికెటర్ల ఎంగేజ్ మెంట్లు, పెళ్లిళ్ల సీజన్ లా ఉంది. మొన్న హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహం జరగగా... నిన్న యువరాజ్ సింగ్, బాలీవుడ్ భామ హ్యాజెల్ కీచ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా, మరో క్రికెటర్ ఇదే బాట పట్టాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్స్ రాబిన్ ఊతప్ప, అతని చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ ల నిశ్చితార్థం జరిగిపోయింది. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో రాబిన్ ఊతప్ప పోస్ట్ చేశాడు. త్వరలోనే తమ వివాహం జరగబోతోందని రాబిన్ వెల్లడించాడు. కొద్ది రోజులుగా రంజీలకు దూరంగా ఉండటం వల్ల శీతల్ తో పెళ్లి ప్రస్తావన తీసుకురావడానికి సమయం దొరికిందని, వెంటనే శీతల్ కూడా ఓకే చెప్పిందని, దీంతో, ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని చెప్పాడు. గత ఏడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News