: వైకాపా నేత పేర్ని నానికి రిమాండ్... కాసేపట్లో సబ్ జైలుకు తరలింపు


వైకాపా నేత పేర్ని నానికి ఈ నెల 27వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, కాసేపట్లో పేర్ని నానిని సబ్ జైలుకు తరలించనున్నారు. వివరాల్లోకి వెళ్తే, బందరు పోర్టు భూసేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ఈ రోజు ఆయన మచిలీపట్నంలో ధర్నా నిర్వహించారు. దీంతో, ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో, కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. మరోవైపు, మరో వైకాపా నేత కొడాలి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

  • Loading...

More Telugu News