: మార్కెట్ లోకి బాబా రాందేవ్ ‘పతంజలి’ న్యూడిల్స్


యోగా గురువు బాబా రాందేవ్ ‘పతంజలి’ న్యూడిల్స్ ను సోమవారం మార్కెట్ లోకి విడుదల చేశారు. తమ సంస్థ నుంచి వస్తున్న 70 గ్రాముల న్యూడిల్స్ ప్యాకెట్ ధర రూ. 15 కాగా, ఇతర సంస్థలు అమ్ముతున్న న్యూడిల్స్ ధర రూ. 25గా ఉందని, అంటే తమ న్యూడిల్స్ పది రూపాయలు తక్కువగానే వస్తున్నాయని రాందేవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ ఏడాది చివరి నాటికి మా కొత్త ఉత్పత్తి న్యూడిల్స్ విక్రయాలను పదిలక్షల స్టోర్లలో జరిగేలా చూస్తాము. వచ్చే ఏడాదిలో న్యూడిల్స్ మాన్యు ఫాక్చరింగ్ ప్లాంట్లను ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది చివరి నాటికి చైల్డ్ కేర్, కాస్మెటిక్స్ ఉత్పత్తులను మార్కెట్ లోకి ప్రవేశపెడతాం. చైల్డ్ కేర్ ఉత్పత్తులను ‘శిశు కేర్’ బ్రాండ్ పేరిట, కాస్మెటిక్స్ ఉత్పత్తులను ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట, హెల్త్ సప్లిమెంట్ పౌడర్ ను ‘పవర్ వీటా’ బ్రాండ్ పేరిట డిసెంబర్ చివరి నాటికి విడుదల చేస్తాం. 2014-15 లో మా సంస్థ సేల్స్ టర్నోవర్ రూ. 2,007 కోట్లు. త్వరలోనే ఇది రూ.5,000 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాము’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News