: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అట్టహాసంగా ప్రారంభించిన కేసీఆర్


టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. హైదరాబాదులోని ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా కొనియాడారని చెప్పారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లను ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News