: కోదండరాం పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు!


రైతుల ఆత్మహత్యల విషయమై జేఏసీ నేత కోదండరాం వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన తెలుగు రాష్ట్రాల హైకోర్టు తెలంగాణ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేసీఆర్ సర్కారును హైకోర్టు ఆదేశించగా, నేడు విచారణ మొదలయ్యే సమయం వరకూ కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, వచ్చే సోమవారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. రాష్ట్రంలో ఆత్మహత్యలు కూడదని రైతుల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రసార మాధ్యమాల్లో విరివిగా ప్రకటనలు ఇవ్వాలని కోరింది. ఆత్మహత్యలపై ప్రభుత్వ స్పందన ఏంటో తెలియజేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News