: యూపీలోనూ మహా కూటమి అవకాశం: అఖిలేష్


బీహారులో బీజేపీ పార్టీ ఓటమికి దారితీసిన మహాకూటమి విధానాన్నే ఉత్తరప్రదేశ్ లోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. 2017 ప్రారంభంలో యూపీలో ఎన్నికలు జరగనుండగా, మహాకూటమి ఏర్పాటు అసాధ్యం ఏమీ కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిస్తే బీజేపీని అడ్డుకోవడం కష్టమేమీ కాదన్న అఖిలేష్, అంతకుమించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ లు కలిస్తే బీజేపీ ఓటమి తప్పదని యూపీ మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో దాదాపు స్వీప్ చేసిన బీజేపీ, అదే ఊపుతో అసెంబ్లీలోనూ పాగా వేయాలని, తద్వారా 15 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News