: బాబు ఆదేశాలతోనే నన్ను అకారణంగా అరెస్టు చేశారు: కొడాలి నాని


కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసిన విషయంలో ఈరోజు ఉదయం అరెస్టయిన ఎమ్మెల్యే కొడాలి నాని స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తనను అకారణంగా అరెస్టు చేశారన్నారు. బాబుకు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు చేశారు. 2019 ఎన్నికల్లోనూ గుడివాడ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన జోస్యం చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారన్నారు. పోలీసులు బలవంతంగా తమను ఖాళీ చేయించారని నాని ఆరోపించారు. కాగా, వైఎస్సార్సీపీ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ భవన యజమాని శశికళ పార్టీ కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News