: హవాయ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘బాహుబలి’


బాహుబలి చిత్రం ప్రారంభించినప్పటి నుంచే కాకుండా, విడుదలై చాలా రోజులు అయిన తర్వాత కూడా ప్రతిరోజూ వార్తలకెక్కుతూనే ఉంది. రికార్డుల పరంగా, కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని హవాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని బాహుబలి చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక ప్రకటన చేసింది. అమెరికాలోని హవాయ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ చిత్రోత్సవాలు జరుగుతున్నాయని తెలిపింది. ‘బాహుబలి’ అంతర్జాతీయ ప్రదర్శనలు కొనసాగుతుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News