: నటి జెన్నిఫర్ వేదికపై మళ్లీ కాలు జారింది!


వేదికలపై కాలు జారి కిందపడిపోవడం హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ కు కొత్తేమీకాదు. తాజాగా, ‘ద హంగర్ గేమ్స్...మాకింగ్ జే పార్ట్ 2’ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మళ్లీ కాలుజారి కిందపడిపోయింది. పడిపోయిన వెంటనే, ఆమె పైకి లేచి నిలబడి తన అభిమానులకు చేతులూపింది. నవ్వుతూ పలకరించింది. పొడవాటి తెల్లటి గౌనులో మెరిసిపోయిన జెన్నిఫర్ తాను ధరించిన హై హీల్స్ కారణంగా బ్యాలెన్స్ తప్పిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. జెన్నిఫర్ కాలు జారి కిందపడిన విషయాన్ని ఈ చిత్రం ప్రొడ్యూసర్ నైనా జాకబ్ సన్ కూడా ధ్రువీకరించాడు. ఆమె క్షేమ సమాచారం గురించి మీడియా ప్రశ్నించగా ‘ఆమెకిది అలవాటేగా... ప్రస్తుతం బాగానే ఉంది’ అంటూ జాకబ్ సన్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News