: ఎందుకింత రాజకీయం చేస్తున్నారు?: టీఆర్ఎస్ పై దత్తాత్రేయ మండిపాటు


పత్తి రైతులను ఆదుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు కేంద్రం రూ. 10 వేల కోట్లను కేటాయించిందని, కేసీఆర్ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. కరవు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం అలసత్వం చూపినందునే కేంద్రం నుంచి నిధులు అందలేదని స్పష్టం చేసిన ఆయన, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నరేంద్ర మోదీని విమర్శించడం తగదని హితవు పలికారు. పత్తి రైతుల విషయంలో ఎందుకింత రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన ఆయన, రైతులను ఆదుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు.

  • Loading...

More Telugu News