: రేపటి నుంచి వరంగల్ ఎన్నికల ప్రచార రంగంలోకి వైఎస్ జగన్... నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటన!


వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీలో నిలిచిన నల్లా సూర్యప్రకాశ్ విజయం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి రంగంలోకి దిగనున్నారు. జగన్ పర్యటన, ప్రచారం షెడ్యూల్ ను ఆ పార్టీ విడుదల చేసింది. 19 వరకూ ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారని, రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి, నాలుగు రోజుల పాటు పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోలను నిర్వహిస్తారని వైకాపా తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జగన్ తన పర్యటనలో భాగంగా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు దాదాపు 50కి పైగా గ్రామాలను చుట్టి వస్తారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News