: భారత్ ఊపుకు బ్రేక్... ఒక్క బాల్ కూడా పడనివ్వని వరుణుడు!
కేవలం 214 పరుగులకు సౌతాఫ్రికా జట్టును మట్టి కరిపించి, ఆపై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసిన భారత ఊపుకు వరుణుడు బ్రేక్ వేశాడు. గత రాత్రి నుంచి బెంగళూరులో పడుతున్న వర్షానికి నేడు రెండవ రోజు మ్యాచ్ లో ఒక్క బాల్ కూడా పడలేదు. ఉదయం నుంచి పలు మార్లు వర్షం పడుతూ, ఆగుతూ ఉండటంతో, పలు మార్లు అంపైర్లు పిచ్ ని గమనించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సైతం కాసేపు వర్షం పడింది. మధ్యాహ్నం 2:30 గంటల్లోగా మ్యాచ్ ప్రారంభించేందుకు వీలు పడకుంటే నేటి ఆట రద్దయినట్టే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సిబ్బంది, గ్రౌండ్ లోని నీటిని అత్యాధునిక పద్ధతులు ఉపయోగించి వెలుపలికి పంపుతున్నప్పటికీ, ఫలితం ఉండటం లేదు. పదే పదే పడుతున్న వానలు రేపు కూడా మ్యాచ్ కి ఆటంకం కలిగిస్తాయని భావిస్తున్నారు.