: గంగూలీ కూడా హాఫ్ సెంచరీ, వార్న్ సేన లక్ష్యం 220


సచిన్ సేన ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడింది. ప్రముఖ బ్యాట్స్ మన్ లంతా చెప్పుకోతగ్గ స్కోరును సాధించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన సచిన్ బ్లాస్టర్స్, వార్న్ సేనకు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహేల జయవర్ధనే అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 50 పరుగులు చేసి వెట్టోరీ బౌలింగ్ లో వెనుదిరగగా, హూపర్ 22 బంతుల్లో 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. వార్న్ వారియర్స్ లో వెట్టోరీకి 3, వాల్ష్, సైమండ్స్ లకు చెరో వికెట్ లభించాయి. మరికాసేపట్లో వార్న్ టీమ్ చేజింగ్ కు దిగనుంది.

  • Loading...

More Telugu News