: పారిస్ పై దాడి అనంతరం ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదుల 6 హెచ్చరికలు... తదుపరి టార్గెట్లు ఇవే!


పారిస్ పై ఉగ్రదాడి జరిపి సుమారు 150 మందికి పైగా అమాయకుల ప్రాణాలను పొట్టన బెట్టుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచానికి ఆరు హెచ్చరికలు పంపారు. అవి ఏంటంటే... 1. ఫ్రాన్స్ తరహా దాడులు మరిన్ని చేస్తాం. మాపై బాంబులు వేసిన ప్రతి దేశానికీ ఇదే గతి పడుతుంది. 2. ఫ్రాన్స్ పై ఎనిమిది మంది సోదరులు అల్లా దయతో దాడి చేశారు. మరెంతో మంది సిద్ధంగా ఉన్నారు. 3. ఎన్నో ఆలోచించిన తరువాతనే పారిస్ ను టార్గెట్ గా ఎంచుకున్నాం. మా లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 4. ఫ్రాన్స్ దేశం వారి విమానాలతో కాలిఫేట్ లోని ముస్లిం సమాజంపై చేస్తున్న దాడులకు ఇది ప్రతీకారం. 5. సిరియాను లక్ష్యంగా చేసుకుంటున్న మిగతా పశ్చిమ దేశాలకూ ఇదే గతి పడుతుంది. 6. మా తదుపరి టార్గెట్ లండన్, వాషింగ్టన్, రోమ్.

  • Loading...

More Telugu News