: భారీ భద్రత మధ్య ఢిల్లీ చేరిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి


అలిపిరి సమీపంలో చంద్రబాబునాయుడిపై హత్యాయత్నం జరిపిన కేసులో నిందితుడిగా ఉండి మారిషస్ లో పట్టుబడిన కొల్లం గంగిరెడ్డిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఐడీ పోలీసులు ఈ తెల్లవారుఝామున ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడి పోలీసు అధికారులకు ట్రాన్సిట్ బెయిల్ పేపర్లు అందించి, అక్కడి నుంచి హైదరాబాదుకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావుకు నిన్న మారిషస్ అధికారులు గంగిరెడ్డిని అప్పగించిన సంగతి తెలిసిందే. రూ. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దేశం దాటించిన పలు కేసులోనూ గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News