: రక్తమోడుతూనే ఫేస్ బుక్ లో అలెర్ట్...బాధితుడి సాహసం


పారిస్ లో ఉగ్రదాడి చోటుచేసుకున్నప్పుడు ఎవరు బతుకుతారో, ఎవరు మరణిస్తారో తెలియదు. అందర్లోనూ ఒకటే భయం...'చచ్చిపోతామేమో'నని. అదే సమయంలో అందర్లోనూ ఒకటే ఆశ 'ఎలాగైనా బతకాల'ని. ఈ సమయంలో ఓ వ్యక్తి గాయపడినప్పటికీ, ఫేస్ బుక్ ద్వారా అందర్నీ అప్రమత్తం చేశాడు. బతక్లాన్ థియేటర్ లో ప్రదర్శన వీక్షించేందుకు బెంజిమిన్ కజోనెవెస్ వెళ్లాడు. తొలుత థియేటర్ బయట ఉన్న కేఫ్ లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, థియేటర్ లోపలికి చొరబడ్డారు. వస్తూనే కాల్పులు ప్రారంభించారు. ఓ బుల్లెట్ నేరుగా వచ్చి బెంజిమిన్ కాలిలో దిగబడింది. అక్కడి నుంచి ఎలాగోలా మొదటి అంతస్తుకు చేరుకున్నాడు. ఇంతలో థియేటర్ లో ఉన్నవారిని ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. ఒక్కొక్కరిని చంపడం మొదలు పెట్టారు. ఇంతలో భద్రతా బలగాలు రంగప్రవేశం చేశాయి. ఫ్రాన్స్ ప్రత్యేక దళానికి చెందిన 'రెయిడ్' పోలీసులు వారిని మట్టుబెట్టారు. ఈ విషయాలన్నీ ఫేస్ బుక్ లో పెట్టిన బెంజిమిన్ 'రెయిడ్' దళానికి ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News