: పారిస్ దాడుల ఉగ్రవాదుల ఆచూకీ తెలుస్తోంది
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల వివరాలు సంపాదించడంలో పోలీసులు విజయం సాధించారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది దగ్గర సిరియా పాస్ పోర్టు లభ్యమైంది. అలాగే స్టేడియం బయట మృతి చెందిన మరో ఉగ్రవాది వద్ద ఈజిప్టు పాస్ పోర్టు లభ్యమైంది. అలాగే బతక్లాన్ వద్ద దాడికి పాల్పడిన ఓ ఉగ్రవాది దక్షిణ పారిస్ కు చెందిన వ్యక్తి అని, అతని చేతి వేలి ముద్రలను బట్టి నిర్ధారించారు. ఆ వ్యక్తి వివరాలు ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక దళాల లిస్టులో ఉన్నట్టు వారు చెప్పారు. స్టేడియం దగ్గర జరిగిన ఉగ్రదాడిలో 15 సంవత్సరాల యువకుడు పాల్గొన్నట్టు ఫ్రాన్స్ పోలీసులు గుర్తించారు. టీనేజర్లు దాడుల్లో పాల్గొనడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.