: విజయవంతమైన ఆపరేషన్ మారిషస్...సీఐడీకి గంగిరెడ్డి అప్పగింత
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేపట్టిన ఆపరేషన్ మారిషస్ విజయవంతమైంది. మారిషస్ లో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని మారిషస్ ప్రభుత్వం అప్పగించింది. హెలికాప్టర్ సర్వైలెన్స్ మధ్య మారిషస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావుకు గంగిరెడ్డిని అప్పగించింది. రేపు సాయంత్రానికి గంగిరెడ్డి హైదరాబాదు చేరుకునే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దేశం దాటించడం, అలాగే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యయత్నం కేసులో గంగిరెడ్డి ప్రధాన నిందితుడు.