: 32,000 మందిని పొట్టనబెట్టుకున్న ఐసీస్
పారిస్ లో జరిగిన ఉగ్రదాడులతో ప్రపంచం ఆందోళన చెందింది. ఫ్రాన్స్ దాడులపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. సిరియా, ఇరాక్ లలో జనహననానికి పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాదుల చర్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఐసీస్ చరిత్రను తిరగేస్తే 2014లో అత్యధిక శాతం హత్యలు చేసింది. కేవలం ఈ ఏడాది కాలంలో 32,000 మందిని వివిధ రూపాల్లో పొట్టనపెట్టుకుంది. ఇస్లాం వ్యాప్తి పేరుతో వేలాది మందిని హత్య చేసిన ఐసిస్ ఆ హత్యలను చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. ఫ్రాన్స్ ను ప్రశాంతంగా ఉండనివ్వమంటూ ఐసిస్ పేర్కొనడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.