: పద్ధతి మార్చుకోకపోతే 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణకు బుద్ధి చెబుతాం: మంత్రి జగదీశ్ రెడ్డి


ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ విషం కక్కుతూనే ఉన్నారని టీఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి, రాధాకృష్ణకు మతి భ్రమించిందని మండిపడ్డారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. పత్రికా విలువలను ఆంధ్రజ్యోతి దిగజార్చుతోందని చెప్పారు. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలను రాస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో దొంగలా రాధాకృష్ణ తయారయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని... లేకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News