: కేటీఆర్, రానా మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర సంభాషణ


తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు దగ్గుబాటి రానాల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉన్నట్టుంది. అందుకే వారిద్దరూ ట్విట్టర్ లో బాగా పరిచయస్తులుగా చాట్ చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఏదో విషయంలో ఆసక్తికర సంభాషణ జరిగింది. వివరాల్లోకి వెళితే, "కేటీఆర్ సర్, నేను బాగున్నాను! మీరెలా ఉన్నారు? త్వరలో మనం తప్పకుండా కలుద్దాం!! చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. కలుసుకుని, మాట్లాడుకుందాం" అని రానా ట్వీట్ చేశాడు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ "ఇప్పట్లో కుదరదు. ప్రస్తుతం నేను వరంగల్ ప్రచారంలో ఉన్నా. వారం తరువాత వస్తా" అని చెప్పారు. దానికి బదులుగా రానా "వారంలోగా కాల్ చేస్తా" అని ట్వీట్ చేశారు. వారి సంభాషణ చూస్తుంటే రానా కూడా తెలంగాణలోని ఏదో ఒక ఊరిని దత్తత తీసుకుంటాడని, అందుకే కేటీఆర్ ను కలవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News