: వయసైపోయిందిగా... అలాగే మాట్లాడతారు: ఎమ్మెస్సార్ వ్యాఖ్యలపై గుత్తా సెటైర్లు
తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూనే సెటైర్లు విసిరారు. క్రియాశీల రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్న ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని గుత్తా అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఎమ్మెస్సార్ కు కేసీఆర్ పాలనపై అవగాహన లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వయసైపోయిన ఎమ్మెస్సార్ కు ఈ అంశంపై నోటిసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చలోక్తి విసిరారు.