: ఈరోజు హైదరాబాదు జూ పార్కులో చిన్నారులకు ఉచిత ప్రవేశం
నేడు బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ జువాలజికల్ పార్కు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు జూ పార్కు క్యూరేటర్ గోపి రవి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున జూ పార్కు తిలకించడానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.