: నాడు ప్రధాన శత్రువు...నేడు మంచి మిత్రుడు: సెహ్వాగ్ పై ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’ వ్యాఖ్య


మొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్ ఎవరంటే, క్షణం కూడా ఆలోచించకుండా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ పేరు చెప్పేవాళ్లం. మెరుపు వేగంతో బంతులను విసరడమే అతడిని ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. ఇక అతడి సొంతూరు రావల్పిండి జనం అతడికి ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’గా నామకరణం చేసుకున్నారు. దాయాదుల మధ్య పోరుగా ప్రసిద్ధిచెందిన భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రధాన పోటీ షోయబ్, సచిన్ ల మధ్యేనన్న వ్యాఖ్యలు వినిపించేవి. అయితే, షోయబ్ కు నాడు ప్రధాన శత్రువు సచిన్ టెండూల్కర్ కాదట. వీర బాదుడు బాదే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగేనట. ఈ విషయాన్ని స్వయంగా షోయబే చెప్పాడు. ప్రస్తుతం ‘ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ’లో భాగంగా షోయబ్ అఖ్తర్ సచిన్ బ్లాస్టర్స్ జట్టులో ఆడుతున్నాడు. నాడు తాను ప్రధాన శత్రువుగా భావించిన సెహ్వాగ్, నేడు మంచి మిత్రుడిగా మారాడని షోయబ్ నిన్న వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News