: లండన్ లో ‘భారతీయం’...కామెరూన్ నోట హిందీ మాట, చీరకట్టులో మిసెస్ కామెరూన్
బ్రిటన్ రాజధాని లండన్ లో నిన్న రాత్రి ‘భారతీయం’ హోరెత్తింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా లండన్ లోని ప్రవాస భారతీయులు నగరంలోని వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడింది. కార్యక్రమానికి ముందు ‘భల్లే భల్లే’ నృత్యాలు హోరెత్తాయి. ఆ తర్వాత స్టేడియానికి వచ్చిన మోదీకి హర్షధ్వానాలతో ఘన స్వాగతం లభించింది. భారతీయ నినాదాలతో హోరెత్తిన స్టేడియంలో బ్రిటన్ ప్రధాని జేమ్స్ కామెరూన్ మరింత జోష్ నింపారు. ‘నమస్తే’ అంటూ ఆయన నోట హిందీ మాట వినిపించడంతో స్టేడియంలో ఎన్నారైలు కేరింతలు కొట్టారు. ఇక కామెరూన్ సతీమణి సమంత భారతీయ సంప్రదాయ వస్త్రధారణ చీరకట్టులో కార్యక్రమానికి హాజరై సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.