: కష్టకాలంలో ఫ్రాన్స్ కు అండగా ఉంటాం: భారత ప్రధాని మోదీ
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడితో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం వద్ద అసలేం జరుగుతోందో తెలియని క్రీడాభిమానులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ దాడిపై ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాక కష్టకాలంలో ఉన్న ఫ్రాన్స్ కు అండగా ఉంటామని కూడా ఆయన ప్రకటించారు.