: ప్యారిస్ దాడిపై ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి... మానవత్వంపై దాడేనన్న ఒబామా
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడిపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఉగ్రదాడి జరిగిన వెంటనే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దాడిపై సమాచారం తెలుసుకున్న వెంటనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘాటుగా స్పందించారు. ప్యారిస్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఆయన మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కూడా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడులు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్ పేర్కొన్నారు.