: 'ఈ టీవీ' నుంచి మరో నాలుగు కొత్త ఛానెళ్లు... రేపటి నుంచే!


తెలుగు ప్రజల కోసం రామోజీ గ్రూప్ 'ఈ టీవీ' నుంచి మరో నాలుగు కొత్త ఛానళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టీవీ న్యూస్, ఎంటర్ టెయిన్ మెంట్ ఛానళ్లు కొన్నేళ్లుగా వస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభించనున్న మరో నాలుగు ఛానళ్లలో ఒకటి కామెడీ కోసం ఈటీవీ ప్లస్, రెండోది ఆరోగ్యం కోసం ఈటీవీ లైఫ్, మూడోది సినిమాల కోసం ఈటీవీ సినిమా, నాలుగోది వంటల కోసం ఈటీవీ అభిరుచి ఉన్నాయి. ఈటీవీ ప్లస్ లో సినిమాలకు సంబంధించిన హాస్యం, రియాలటీ షోలు, ఈ టీవీ సినిమాలో బడా హీరోల సినిమాలు ప్రసారమవుతాయని తెలుస్తోంది. ఈ టీవీ సినిమా కోసం ఇప్పటికే చాలా సినిమాలను సదరు సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు కొత్త ఛానళ్ల ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News