: 408 మంది డాక్టర్లను తీసేసిన ఒడిశా ప్రభుత్వం


ఒడిశా ప్రభుత్వం 408 మంది ప్రభుత్వ వైద్యులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన విధులను నిర్వర్తించకుండా విధులకు గైర్హాజరవుతూ తప్పించుకున్న వారందరి పైనా ఒకేసారి వేటు వేసింది. ఒడిశా ఆరోగ్యశాఖా 408 మంది వైద్యులను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 412 మందికి నోటీసులు జారీ చేయగా, అందులో కేవలం నలుగురు మాత్రమే స్పందించారని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. తమను విధుల నుంచి తొలగించవద్దంటూ వేడుకున్నారని, దీంతో ఆ నలుగురు మినహా మిగిలిన వారందర్నీ విధుల నుంచి తప్పిస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయాన్ని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సమర్ధించడం విశేషం.

  • Loading...

More Telugu News