: పవన్-బాబు భేటీ వెనుక హై డ్రామా నడిచింది: రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ భేటీ వెనుక హై డ్రామా నడిచిందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకునేందుకు చంద్రబాబునాయుడే ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని అన్నారు. రెండు గంటల భేటీ అనంతరం చంద్రబాబు సిద్ధం చేసిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ యథాతథంగా చదవి వినిపించారని ఆయన ఆరోపించారు. పవన్ మద్దతు తనకు ఉందని చెప్పేందుకే పవన్ కల్యాణ్ ను సీఎం కార్యాలయానికి రప్పించుకున్నారని రామచంద్రయ్య విమర్శించారు.