: పరవాడ ఎంపీపీతో పాటు ముగ్గురు టీడీపీ నాయకులకు జైలు శిక్ష


ఒక పోలీసు అధికారి విధులకు ఆటంకం కల్గించిన కేసులో విశాఖ పట్టణం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులకు అనకాపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పరవాడ టీడీపీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, టీడీపీ నాయకులు వెంకట్రావు, రవికుమార్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనకాపల్లి 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు ప్రకటించింది. కాగా, 2006 వ సంవత్సరంలో ఒక పోలీసు అధికారి విధులకు ఈ ముగ్గురు నాయకులు ఆటంకం కల్గించారని గతంలో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News