: పవన్ కల్యాణ్ పాటలకు స్టెప్పులేసిన రాజశేఖర్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు ప్రముఖ నటుడు రాజశేఖర్ స్టెప్పులేశారు. అమెరికాలోని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను న్యూజెర్సీలో నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజశేఖర్, భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాల్లోని పాటలకు రాజశేఖర్ చాలా హుషారుగా స్టేజిపై స్టెప్పులేశారు. కాగా, గతంలో జీవిత రాజశేఖర్ దంపతులపై చిరంజీవి అభిమానులు దాడి చేయడం...మెగా ఫ్యామిలీపై రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించడం వంటి సంఘటనలు గతంలో హాట్ టాపిక్ గా ఉన్నాయి. తమ చిత్రాల్లో ఒకరిపై మరొకరు వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా చేసుకున్నారు.