: లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: బాలకృష్ణ


లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై చర్చల నిమిత్తం హైదరాబాదులో సచివాలయంలో మంత్రి మాణిక్యాలరావును ఆయన కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకుగాను రూ.14.20 కోట్లు ఖర్చవుతుందని తమ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారన్నారు. పర్యాటక ప్రాంతంగా లేపాక్షిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. డిక్టేటర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నందువల్లే తిరుపతి సదస్సుకు వెళ్లలేకపోయానని ఆయన పేర్కొన్నారు. మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ, దేవాదాయ, పురావస్తు శాఖల సమన్వయంతో లేపాక్షిని అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా లేపాక్షికి తగు ప్రాచుర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. కాగా, లేపాక్షి ఉత్సవాల పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో స్వరపరచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News