: కళాశాలలు, ‘వర్శిటీ’ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం... సీఎం కేసీఆర్


ఉస్మానియా యూనివర్శిటీ వసతి గృహాల పెండింగ్ మెస్ చార్జీల విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. పెండింగ్ మెస్ చార్జీలు సుమారు రూ.7 కోట్ల వరకు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కాలేజీలు, యూనివర్శిటీల హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం, ఇందుకోసం వచ్చే ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్టడీ సెంటర్ల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ, గ్రూప్ పరీక్షలతో పాటు జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలకు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ, విదేశాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం అందిస్తున్న సాయంపై విస్తృత ప్రచారం నిర్వహించి, సమాజంలో వెనుకబడిన కుటుంబాలు పథకాల ద్వారా లబ్ధి పొందేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. కాగా, హాస్టళ్లలో భోజనానికి, మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 700 కోట్లు వెచ్చిస్తోంది.

  • Loading...

More Telugu News